- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్ : మద్నూర్ మండల కేంద్రంలో మంగళవారం ఊరదేవతలకు బోనాలు నైవేద్యాలు సమర్పించారు. మండల కేంద్రంలోని వాడవాడలో బేడల వారీగా భాజా భజంత్రీలతో బోనాలు తీశారు. గ్రామంలోని ఊర దేవతలకు టెంకాయలు కొట్టి నైవేద్యాలు సమర్పించగా.. లక్ష్మమ్మ తదితర దేవతలకు మేకలతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆషాడ మాసంలో జరుపుకునే ఈ బోనాల పండుగకు గ్రామస్తులంతా ఊరదేవతలకు కోరుకునేది వర్షాలు బాగా పడాలని, పాడి పంటలు బాగా పండాలని, ప్రజలందరికీ సుఖ సంతోషాలతో ఉంచాలని కోరుకోవడం జరిగింది. ఈ బోనాల పండుగతో మండల కేంద్రంలో పండగ వాతావరణం కనిపించింది.
- Advertisement -