Sunday, July 20, 2025
E-PAPER
Homeఆదిలాబాద్పాఠశాలలో ఘనంగా బోనాలు..

పాఠశాలలో ఘనంగా బోనాలు..

- Advertisement -

నవతెలంగాణ – బజార్ హాత్నూర్: మండల కేంద్రంలోని కురుక్షేత్ర పాఠశాలలో బోనాల పండుగను శనివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థినిలు, మహిళా ఉపాధ్యాయులు నెత్తిన బోనమేత్తుకొని సంప్రదాయ దుస్తులను ధరించి బోనాల పాటలపైన నృత్యాలు చేశారు. పాఠశాల ఆవరణలో రంగురంగుల ముగ్గులు వేశారు. విద్యార్థుల పోతురాజు, పులి వేషాలు పలువురిని ఆకట్టుకున్నాయి. అంతే కాకుండా మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా బోనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సబ్బిడి నవీన్ కుమార్, ఉపాధ్యాయ బృందం, పాఠశాల పోషకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -