Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఎన్నికల ప్రక్రియలో బూత్ లెవెల్ అధికారులే కీలకం: అదనపు కలెక్టర్ బి.చందర్

ఎన్నికల ప్రక్రియలో బూత్ లెవెల్ అధికారులే కీలకం: అదనపు కలెక్టర్ బి.చందర్

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా బూత్ లెవల్ అధికారులకు నిర్వహిస్తున్న ట్రైనింగ్ కార్యక్రమంలో భాగంగా కామరెడ్డి జిల్లాలోని మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నేడు ప్రారంభమైంది. ఇందులో మద్నూర్ డోంగ్లి మండలాల బూతు లెవల్ అధికారులకు ఎన్నికల నిర్వహణలో వారి పాత్ర,  ఓటరు జాబితా రూపకల్పనలో వారి పాత్ర , ఇంటింటి సర్వే, ఫారం 6, 7, 8 లను ఏ విధంగా  చేయాలి, దాంట్లో వస్తున్నటువంటి సమస్యలు, పరిష్కారాలపై టీవీ ద్వారా బిఎల్ఓ లకు గురువారం ట్రైనింగ్ ఇచ్చారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బి.చందర్  మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగిన బిఎల్ఓ అధికారులే కీలకం అన్నారు. వీరు లేనిదే ఎన్నికలు, ఎన్నికల సంఘం  లేదన్నారు. అలాంటి గొప్ప పాత్ర బిఎల్ఓ లది అని తెలిపారు. కావున ఓటర్ జాబితాను తప్పులు లేకుండా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ ఎండి ముజీబ్, నాయబ్ తహసిల్దార్ శివరామకృష్ణ, గిర్దవార్ లు శంకర్, సాయిబాబా, రవి, బాలరాజు, దశరథ్, ప్రవీణ్ రెండు మండలాల బిఎల్ వోలు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad