- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ములుగు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కోతులను చంపేందుకు స్థానికులు విషం కలిపిన ఆహారం ఉంచగా, అది పొరపాటున 4 ఏళ్ల బాలుడు తినడంతో మృతి చెందాడు. గోవిందరావుపేటలో అంగన్వాడీ కేంద్రం వద్ద ఉంచిన బాలామృతం లడ్డూలను ఆడుకుంటూ వెళ్లిన పిల్లలు తీసుకున్నారు. చేదుగా ఉండటంతో మిగతావారు వదిలేసినా, హర్షిత్ నందన్ మాత్రం తినేశాడు. అనంతరం అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
- Advertisement -



