Saturday, August 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డ్రాయింగ్ లో ప్రతిభ చాటిన బాలుర గురుకుల విద్యార్థులు ..

డ్రాయింగ్ లో ప్రతిభ చాటిన బాలుర గురుకుల విద్యార్థులు ..

- Advertisement -

విద్యార్థులు కళాత్మకమైన పోటీల్లో పాల్గొనాలి..
నవతెలంగాణ – మద్నూర్ 

విద్యార్థులు కళాత్మకమైన పోటీల్లో పాల్గొనాలని ప్రిన్సిపాల్ నందాల గంగాకిశోర్, ప్రముఖ పద్యకవి డా బి. వెంకట్ కవి అన్నారు. మద్నూరు తెలంగాణ గురుకుల బాలుర విద్యాలయం మరియు జూనియర్ కళాశాలకు సంబంధించిన 8 మంది విద్యార్థులు డ్రాయింగ్ లో ప్రతిభను కనబరిచినారని ప్రిన్సిపాల్ నందాల గంగా కిశోర్, ఆర్ట్ టీచర్ నరహరి ప్రసాద్ లు తెలిపారు. జనవరి 2025 , 16,17,18 వ తేదీలలో కామారెడ్డిలో తెలంగాణ ప్రభుత్వమువారిచే నిర్వహింపబడిన డ్రాయింగ్ లోయర్ గ్రేడ్  టెక్నికల్  సర్టిఫికెట్ కోర్సులో 10వ  తరగతికి చెందిన బి.బాలకృష్ణ, జి.ఆంజనేయులు, జే జ్ఞానేశ్వర్,ఏ.యోగేంద్ర,9 వ తరగతికిచెందినసిహెచ్రామచంద్రన్,యస్.అభిషేక్,కే.ప్రశాంత్,సి.శివ లు  ఉత్తీర్ణులయ్యారని చెప్పారు.

ఈ విద్యార్థులు డ్రాయింగ్  ఉదాహరణలు,మోడల్  డ్రాయింగ్, మెమొరీ డ్రాయింగ్, ప్రకృతిబొమ్మలు, స్టిల్ లైఫ్ పేయింటింగ్, జామెట్రికల్ డ్రాయింగ్, డెకోరేటివ్ రిటరింగ్, ప్యాటర్న్ డిజైనింగ్ వంటి చిత్రాల విషయాంశాలపై  సాంకేతిక పరీక్షలను వ్రాశారని, ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణులతో ఉత్తీర్ణులయ్యారని, కళల్లో మంచి ప్రతిభను కనబరిచారని  అన్నారు. ప్రిన్సిపాల్ యన్ గంగాకిశోర్, ఆర్ట్ టీచర్ నరహరి ప్రసాద్, సహాయ  ప్రిన్సిపాల్ సుమన్, సంస్కృత భాషా ప్రచార సమితి నిజామాబాదు ఉమ్మడి జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు డా బి. వెంకట్ కవి, ఉపాధ్యాయులు – వేణుగోపాల్,జే గణేశ్,రాము లు ఉత్తీర్ణతపత్రాలను విద్యార్థులకు అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -