భువనగిరి పట్టణంలోని దయాకర్ పద్మ ఇంట్లో పూసిన బ్రమ్మ కమలం
నవతెలంగాణ – భువనగిరి
పువ్వు లు అంటే కొంతమందికి పిచ్చి ప్రేమ ఉంటుంది. అందులో అరుదైన పువ్వు ల మొక్కలను సేకరించి తమ నివాస స్థలంలో ఇష్టపూర్వకంగా పెంచుకుంటూ ఉంటారు. అలాంటిదే యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని నెహ్రూ రోడ్ లో గల ఇంట్లో అరుదైన పువ్వు ల మెుక్కలతో సుందరంగా తీర్చుకున్నారు. ఎంతో విశిష్టంగా భావించే పవిత్రంగా భావించే బ్రహ్మ కమలం ఇది అరుదైన మొక్క. ఇది హిమాలయ పర్వతాలలో ఎక్కువగా లభిస్తుందంటారు. కానీ భువనగిరి పట్టణంలోని దయాకర్ పద్మ ఇంట్లో ఇది ఏడాదికి ఒకసారి పూస్తుందంటారు. కానీ కొన్ని సందర్భాలలో ఐదు పది సంవత్సరాలకు పూయకుండా ఉంటుంది.ఈ పువ్వు పూయడని అదష్టంగా భావిస్తుంటారు.
ఇది రాత్రి వేళలో పుష్పించే సువాసన భరితమైనటువంటి పుష్పము. ఇది కమలం ఆకారంలో ఉండి తెల్లగా వెన్నెల మాదిరిగా కనిపిస్తుంది. ఈ పువ్వు నుండి వచ్చే సుగంధం కొద్ది దూరం వరకు వ్యాపిస్తుంది. అందుకే దీనికి ఒక ప్రత్యేకత. సంకట చతుర్థి రోజు శ్రావణమాసంలో తమ ఇంట్లో ఈ పువ్వు రావడం తమ అదష్టంగా భావిస్తూ విశిష్ట పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో పాటు పలువురు బస్తివాసులు ఈ పూజల్లో పాల్గొని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ పుష్పాన్ని చూడడమే అదష్టంగా భావిస్తున్నామని పవిత్రమైన సంకట చతుర్థి రోజు ఇంకా ప్రత్యేకత అనిపిస్తుందని అన్నారు.
భువనగిరిలో పూసిన బ్రహ్మ కమలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES