నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నాలుగో రాష్ట్ర మహాసభలు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. నవంబర్ 27 నుంచి 29వ తేదీ వరకు మూడు రోజులపాటు ఈ మహాసభలు నిర్వహిస్తున్నారు.
నేడు జిల్లా కేంద్రంలో మహాసభల సందర్భంగా మహా ర్యాలీ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. అనంతరం లుంబిని దీక్షాభూమిలో బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ జాతీయ వైస్ చైర్‌పర్సన్, మాజీ ఎంపీ బృందా కారత్, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎంపీ డాక్టర్ మీడియం బాబూరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఆదివాసీలు ఎదుర్కొంటున్న భూమి, అటవీ హక్కులు, పోడు వ్యవసాయం, విద్య, వైద్యం, ఉపాధి తదితర సమస్యలపై మహాసభల్లో విస్తృతంగా చర్చించనున్నారు. ఆదివాసీల హక్కుల సాధన కోసం భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నారు. ఆదివారం ప్రతినిధుల సభ నిర్వహించి నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకోనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి సంఘం నాయకులు, ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరవుతున్నారు.






కామెంట్‌లు (0)