ఎస్‌ఐ పరీక్షా కేంద్రాల వద్ద ఆంక్షలు

1 గంట క్రితం

Restrictions at SI examination centers
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: సివిల్‌ ఎస్‌ఐ, సమాన స్థాయి పోస్టుల భర్తీకి ఈ నెల 29న నిర్వహించనున్న పీఆర్‌బీటీ-2026 రాత పరీక్ష నేపథ్యంలో సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ మేరకు కమిషనర్‌ డాక్టర్‌ ఎం. రమేశ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 200 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువమంది గుమిగూడటాన్ని నిషేధించారు. 100 మీటర్ల పరిధిలో జిరాక్స్‌, ఫొటోకాపీ, ఇంటర్నెట్‌ సెంటర్‌లను మూసివేయాలని ఆదేశించారు. ఆ రోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. అంత్యక్రియల ఊరేగింపునకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్