Magazines

పెళ్లిళ్లలో ఆహ్వానం లేకుండా భోజనం చేస్తే జైలు శిక్ష.. రూ.5 వేల జరిమానా?

25 నిమిషాల క్రితం

A jail term and a fine of Rs 5,000 for eating at a wedding without an invitation?
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 26, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ఆహ్వానం లేకుండా ఫంక్షన్‌ హాళ్లలోకి వెళ్లి భోజనం చేసే వారిని ఉద్దేశించి వనపర్తిలో ఓ ఫంక్షన్‌ హాల్‌ యాజమాన్యం హెచ్చరిక ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. అనుమతి లేకుండా ప్రవేశించి భోజనం చేస్తూ పట్టుబడితే బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 329 కింద మూడు నెలల జైలు, రూ.5 వేల జరిమానా విధించే అవకాశం ఉందని హెచ్చరించింది.

శుభకార్యాలకు ముందుగానే అతిథుల సంఖ్యను అంచనా వేసి వంటలు సిద్ధం చేస్తుంటారు. అయితే ఆహ్వానం లేకుండా వచ్చి భోజనం చేసేవారి వల్ల అసలైన ఆహ్వానితులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫంక్షన్‌ హాల్‌ యాజమాన్యం హెచ్చరిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 329 ప్రకారం ఇతరుల ఆస్తిలో నేరపూరిత ఉద్దేశంతో ప్రవేశించడం లేదా అక్కడ అక్రమంగా ఉండడం క్రిమినల్‌ ట్రెస్‌పాస్‌గా పరిగణించవచ్చు. నేరం రుజువైతే మూడు నెలల వరకు జైలు, రూ.5 వేల వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. అయితే కేవలం ఆహ్వానం లేకుండా భోజనం చేసినంత మాత్రాన ఈ సెక్షన్‌ వర్తించదు. నేరపూరిత ఉద్దేశం ఉన్నట్లు నిరూపించాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్