నవతెలంగాణ - హైదరాబాద్ : హర్యానాలోని రోహ్‌తక్ జిల్లా ఖరావడ్ గ్రామం సమీపంలోని మిలన్ హోటల్‌లో బుధవారం రాత్రి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో నలుగురు యువకులు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు ఝజ్జర్ జిల్లా డీఘల్ గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. పోలీస్ చౌకీకి సమీపంలోనే ఈ ఘటన జరగడం కలకలం రేపింది. హిమాంశు, సన్నీ రిటోలియా గ్యాంగ్‌ల మధ్య జరిగిన గ్యాంగ్‌వార్ కారణంగా ఈ కాల్పులు జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
హర్యానాలో గ్యాంగ్‌వార్.. కాల్పుల్లో నలుగురు యువకులు మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 26, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)