నవతెలంగాణ - హైదరాబాద్ : ఉమ్మడి నెల్లూరు జిల్లా చిలకూరు మండలం వరకల క్రాస్‌రోడ్ వద్ద బుధవారం అర్ధరాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తున్న మణికంఠ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేసి, అందులో ఉన్న 34 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పి ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.






కామెంట్‌లు (0)