నవతెలంగాణ – నాచారం: ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన మూడు సంవత్సరాల ప్రజా ప్రస్థానం, సేవలు, నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు (పీఏ) ఆలేటి రమేష్ రచించిన “ప్రజలే కుటుంబం – ప్రజా సేవే ధ్యేయం – అభివృద్ధే లక్ష్యం” పుస్తకాన్ని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆవిష్కరించారు.
ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఉప్పల్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి చేసిన కృషి, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించిన వివరాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు.
ప్రజలనే కుటుంబంగా భావిస్తూ, ప్రజాసేవను ధ్యేయంగా, నియోజకవర్గ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ఎమ్మెల్యే సాగిస్తున్న ప్రస్థానాన్ని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని రూపొందించినట్లు ఆలేటి రమేష్ తెలిపారు. ఎమ్మెల్యే జన్మదిన వేడుకల్లో పుస్తక ఆవిష్కరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.






కామెంట్లు (0)