నవతెలంగాణ - హైదరాబాద్ : హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో బుధవారం తెల్లవారుజామున జరిగిన బైక్ ప్రమాదంలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి చెందింది. బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో వెనుక కూర్చున్న సుష్మా చౌదరి (28) ప్రాణాలు కోల్పోగా, బైక్ నడిపిన అక్షయ్ కుమార్ (28) గాయపడ్డాడు.
రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన సుష్మా కొండాపూర్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. వైజాగ్‌కు చెందిన అక్షయ్ కుమార్ ఓ ప్రైవేట్ కంపెనీలో ప్రొడక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి మాదాపూర్‌లోని కావూరి హిల్స్‌లో స్నేహితుడి ఇంటికి డిన్నర్‌కు వెళ్లిన ఇద్దరూ తెల్లవారుజామున బుల్లెట్‌పై కొండాపూర్‌కు తిరిగి బయలుదేరారు.
హైటెక్ సిటీ, చిన్న పెద్దమ్మ ఆలయం సమీపంలోని సీఐఐ జంక్షన్ వద్ద బైక్ అదుపుతప్పి డివైడర్‌ను, ఆపై మధ్యలో ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుష్మాకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను మాదాపూర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






కామెంట్‌లు (0)