Magazines

సామాన్యులకు షాక్‌..

1 గంట క్రితం

A shock for the common man... sugar costs Rs 70 per kilo!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : దేశంలో చక్కెర ధరలు రోజురోజుకూ పెరుగుతూ సామాన్యులకు భారంగా మారుతున్నాయి. పలు ప్రధాన నగరాల్లో కిలో చక్కెర ధర రూ.60 నుంచి రూ.70 వరకు పలుకుతోంది. కోల్‌కతాలో అత్యధికంగా రూ.70 ఉండగా, ఢిల్లీలో రూ.64, ముంబై, రాంచీల్లో రూ.63, హైదరాబాద్‌లో రూ.62, చెన్నైలో రూ.60గా నమోదైంది. గత ఏడాది కాలంలో చక్కర ధరలు సుమారు 30 శాతం పెరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం 2.5 లక్షల టన్నుల చక్కెర దిగుమతి కోటాను కేటాయించినప్పటికీ ధరల పెరుగుదలకు అడ్డుకట్ట పడటం లేదు. దేశీయంగా సరఫరా పరిస్థితులతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం కూడా ఇందుకు కారణమవుతోంది. దీంతో ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న సామాన్యులపై అదనపు భారం పడుతోంది. వంటింటి బడ్జెట్‌ తలకిందులవుతోంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్