నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడులో త్వరలో బైపోల్ నగరా మోగనుంది. ఇటీవల అధికార పార్టీ తమిళగ వెట్రి కజగం(టీవీకే) ఎమ్మెల్యే వీస్ బాబు చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో కోలత్తూరు శాసనసభ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యమైయాయి. దీనికి ఎన్నికల కమిషన్ నుంచి నోటిఫికేషన్ విడుదల చేయడమే తరువాయి. అయితే అందరి చూపు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ పై పడింది. ఆయన మరోసారి ఆ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారని ప్రచారం జోరుందుకుంది.
తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో సినీ నటుడు జోసెప్ విజయ్ సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. పార్టీ పెట్టిన అనతికాలంలోనే 100పైగా స్థానాలను కైవసం చేసుకొని టీవీకే రికార్డు వికర్టీ సాధించింది. అదే విధంగా డీఎంకే కు కంచుకోటగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం కోలత్తూరులో ఎంకే స్టాలిన్ ఓడిపోవడం మరో సంచలనం. ఆయన పై బాబు 8,795 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
బాబు 82,997 ఓట్లు సాధించగా, స్టాలిన్ 74,202 ఓట్లు పొందారు. ఈ ఫలితంతో, 2011 నుండి ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్న స్టాలిన్ విజయ పరంపరకు తెరపడింది.దీంతో డీఎంకే అధికారం కోల్పోవడమేకాకుండా ఆ పార్టీ అధినేత కూడా ఓటమి చవిచూశారు. అయితే తాజాగా అనారోగ్యం కారణాలతో టీవీకే ఎమ్యెల్యే మరణించారు. మరోసారి డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ బరిలో నిలిచే చాన్స్ వచ్చింది. డీఎంకే పార్టీ శ్రేణులు కూడా ఆయన పోటీ చేయాలని కోరుకుంటున్నారు. డీఎంకే అధినేత నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం. మరో వైపు అధికార పార్టీ కూడా వీస్ బాబు లాంటి లీడర్ ను కోలత్తూరు బరిలో దింపాలని కసరత్తు చేసోంది.





కామెంట్‌లు (0)