Magazines

మ్యూజియంగా సోనియాగాంధీ ఇల్లు

1 గంట క్రితం

Sonia Gandhi's house to become a museum
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: ఇటలీలో ఉన్న కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ చిన్ననాటి ఇల్లు మ్యూజియంగా మారనుంది. ఆమె చిన్ననాటి వస్తువులు, పలు జ్ఞాపికలతో ప్రదర్శనకు ఉంచనున్నారు. ఇటలీ సిక్కు వ్యాపారవేత్త సుఖ్‌దేవ్ సింగ్ కాంగ్ జాతీయ మీడియాకు వెల్లడించారు. ఆమె వస్తువుల సేకరణ అంశంపై త్వరలోనే వారి కుటుంబసభ్యులను కలువనున్నట్లు తెలియజేశారు.


ఇటలీలోని విసెంజా ప్రావిన్స్‌లోని లుసియానాలో బూడిద రంగు రాతి, కాంక్రీట్ భవనంలో ఉన్న ఈ ఆరు గదుల ఇల్లు, బ్రెస్సియాలోని తన నివాసం నుండి సుమారు గంట దూరంలో ఉందని ఆయన చెప్పారు. 1946 డిసెంబర్ 9న గాంధీ అక్కడే జన్మించారని, ఆమె తన బాల్యాన్ని అక్కడే గడిపారని ఆయన తెలియజేశారు."దీనిని ఇండియన్ హౌస్ అని పిలుస్తామని, ఇంటి బయట ఉన్న నేమ్‌ప్లేట్‌పై దీనిని 'సోనియా గాంధీ జన్మస్థలం' అని పేర్కొన్నారు,"



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్