Magazines

కల్లు దుకాణాల్లో ఆబ్కారీ ఆకస్మిక తనిఖీలు

31 నిమిషాల క్రితం

Excise
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 21, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్ 
సంగారెడ్డి జిల్లాలో క్లోరోహైడ్రేట్ తరలిస్తూ నిందితులు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆబ్కారీ శాఖ అప్రమత్తమైంది. ప్రజల ఆరోగ్య దృష్ట్యా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కల్లు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మద్నూర్‌ గ్రామంతో పాటు పలు గ్రామాలలో సీఐ వినోద్‌ రాథోడ్‌ ఆయన బృందం కల్లు దుకాణాల్లో శాంపిల్స్‌ను సేకరించారు. కల్లులో కల్తీ, లేదా మత్తు పదార్థాలు కలిపి ప్రజలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని నిర్వాహకులను హెచ్చరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్