నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడు లో ఓ హత్య కేసులో గోల్డ్ రింగ్ హత్య చేసిన నిందితుని పట్టించింది. ఆరు గంటలోపు నిందితుని ఆ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ రాష్ట్ర పోలీసుల తెలిపిన పూర్తి వివరాల ప్రకారం.. ఈ ఏడాది నవంబర్ 13న తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని నాగర్‌కోయిల్ రైల్వే యార్డులో రైల్వే కోచ్ లో ఓ 54 ఏండ్ల మహిళ మృతదేహాం కన్పించింది. సిబ్బంది రైలు బోగీని శుభ్రం చేస్తుండగా విషయం వెలుగులోకి వచ్చింది. చుట్టుపక్కల వెతికిన ఎలాంటి ఆధారం లభ్యంకాలేదు. కానీ సదురు మహిళ చేతికి ఉన్న గోల్డ్ రింగ్ పై ఉన్న ప్రత్యేక డిజైన్ ద్వారా రైల్వే ఎస్పీ (త్రిచి) ఆదర్శ్ పచేరా కేసును దర్యాప్తు ప్రారంభించారు.
ఉంగరంపై ఉన్న హాల్‌మార్క్ వివరాలు దాని మూలాన్ని గుజరాత్‌లో గుర్తించడానికి దర్యాప్తు అధికారులకు సహాయపడ్డాయి. ఆ ఉంగరాన్ని ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఉన్న ఒక రిటైలర్‌కు సరఫరా చేసినట్లు ధృవీకరించారు. ఈ ఆధారంతో, పోలీసులు ఆ మహిళ పాన్ వివరాలను, ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు ఆమె అందించిన మధ్యప్రదేశ్ చిరునామాను రాబట్టగలిగారు.
దీంతో ఆమె కుటుంబ సభ్యులను కలిశారు. సదరు మహిళ గత మూడు నెలలుగా తన స్వగ్రామం నుండి అదృశ్యమైనట్లు తెలిసింది. వారి అందించిన ఆధారులతో దర్యాప్తులో వేగం పెంచారు పోలీసులు. రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీ నిందితుడిని గుర్తించడంలో కీలక పాత్ర పోషించింది. ఆ ఫుటేజీలో తెల్లని దుస్తులు ధరించిన ఒక వ్యక్తి రైలు బోగీ నుంచి దిగడం కనిపించింది.
రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌పై తిరుగుతూ ఉండే ఒక బిచ్చగాడిగా గుర్తించారు. అతను ఆమెను రైలులోని ఉపయోగంలో లేని బోగీలోకి తీసుకెళ్లి, బలవంతం చేసి, లైంగిక దాడికి పాల్పడిన తర్వాత ఆమెను హత్య చేశాడని పోస్టుమార్టం నివేదిక తెలిపిందని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. సదురు మహిళను చంపడానికి ఎలాంటి ఆయుధాలు వాడలేదని, ఆమె ఛాతిపై బలంగా కొట్టడంతో ఆమె మరణించిందన్నారు.






కామెంట్‌లు (0)