Magazines

అనిరుధ్-కావ్యా మారన్ వివాహం..సీఎం రేవంత్, కేటీఆర్‌లకు ఆహ్వానం

17 అక్టోబర్, 2026

revanth Reddy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్యా మారన్‌ల వివాహ రిసెప్షన్‌కు ముహూర్తం ఖరారైంది. నవంబర్ 21న చెన్నైలో ఈ వేడుక జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావులను సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్ దంపతులు స్వయంగా ఆహ్వానించారు.

శుక్రవారం హైదరాబాద్‌లో పర్యటించిన కళానిధి మారన్, ఆయన అర్ధాంగి కావేరి మారన్.. తొలుత జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డి దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. తమ కుమార్తె కావ్యా మారన్, అనిరుధ్ రవిచందర్‌ల వివాహ రిసెప్షన్‌కు తప్పకుండా హాజరు కావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) తన అధికారిక ఎక్స్ ఖాతాలో ధ్రువీకరించింది. అనంతరం కళానిధి మారన్ దంపతులు బీఆర్ఎస్ నేత కేటీఆర్, ఆయన భార్య శైలిమను కలిసి రిసెప్షన్‌కు ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ నూతన దంపతులకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.

గత కొంతకాలంగా అనిరుధ్, కావ్యా మారన్‌ల ప్రేమ, పెళ్లి గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. గతంలో ఈ వార్తలను అనిరుధ్ ఖండించాడు. ఆ తర్వాత నటుడు వై.జి. మహేంద్రన్‌తో కావ్య వివాహం జరుగుతుందన్న ప్రచారం కూడా జరిగింది. అయితే, తాజా ఆహ్వానాలతో ఈ వార్తలకు అధికారికంగా ముగింపు పలికినట్టు అయింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్