Magazines

మాజీ ప్రధాని షేక్ హసీనా రాక..బంగ్లాదేశ్‌లో భద్రతా ఆందోళనలు

2 గంటల క్రితం

Arrival of former Prime Minister Sheikh Hasina sparks security concerns in Bangladesh
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: మాజీ ప్రధాని షేక్ హసీనా వచ్చే నెలలో తిరిగి వస్తారనే వార్తల నేపథ్యంలో, బంగ్లాదేశ్‌లో భద్రతా ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో వరుసగా అల్లర్లు, వాహనాలకు నిప్పు పెట్టే ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య, గజీపూర్‌లోని ఢాకా-మైమెన్‌సింగ్ రహదారిపై నిరసనకారులు జరిపిన దాడిలో డిప్యూటీ పోలీస్ కమిషనర్‌కు చెందిన వాహనం దగ్ధమైంది. ఈ అశాంతికి షేక్ హసీనా రాకతో సంబంధం ఉందని తెలుస్తోంది.


ప్రస్తుతం నిషేధానికి గురైన అవామీ లీగ్, దాని అనుబంధ సంస్థలు బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పలు అల్లర్లకు కారణమని భావిస్తున్నారు. షేక్ హసీనా సొంత జిల్లా గోపాల్‌గంజ్‌తో సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో రహదారులను దిగ్బంధించడం, పోలీసు వాహనాలకు నిప్పు పెట్టడం వంటి ఘటనలు వెలుగుచూశాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్