నవతెలంగాణ-హైదరాబాద్ : నల్లగొండలో జరుగుతున్న ఆలిండియా కిసాన్ సభ (AIKS) 36వ జాతీయ మహాసభల్లో నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా డాక్టర్ అశోక్ ధావలే, విజ్జు కృష్ణన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోశాధికారిగా పుష్పేంద్ర త్యాగిలను మహాసభ ఎన్నుకున్నది.
నూతన కమిటీ
అశోక్ ధవాలే -అధ్యక్షులు
విజూ కృష్ణన్ -కార్యదర్శి
హన్నన్ మొల్లా -ఉపాధ్యక్షలు
అమ్రారామ్ -ఉపాధ్యక్షలు
ఇ.పి.జయరాజన్ -ఉపాధ్యక్షలు
పరేష్ పాల్ -ఉపాధ్యక్షలు
ఎం.విజయకుమార్ -ఉపాధ్యక్షలు
ఎస్.కె.ప్రీజ -ఉపాధ్యక్షలు
ఇందర్‌జిత్ సింగ్ వి -ఉపాధ్యక్షలు
జితేందర్ చౌదరి -ఉపాధ్యక్షలు
బాదల్ సరోజ్ -ఉపాధ్యక్షలు
వినోద్ కుమార్ -ఉపాధ్యక్షలు
ముకుల్ సింగ్ -ఉపాధ్యక్షలు
పి.కృష్ణ ప్రసాద్ -సహాయకార్యదర్శి
అవాదేశ్ కుమార్-సహాయకార్యదర్శి
మరియం ధవాలే -సహాయకార్యదర్శి
కె.ఎన్.బాలగోపాల్ -సహాయకార్యదర్శి
వల్సాన్ పనోలి -సహాయకార్యదర్శి
అజిత్ నవలే -సహాయకార్యదర్శి
రతన్ దాస్ -సహాయకార్యదర్శి
పరమేశ్ పాల్ -సహాయకార్యదర్శి
టి.సాగర్ -సహాయకార్యదర్శి
ప్రభాకర్ రెడ్డి -సహాయకార్యదర్శి
ఈ సందర్భంగా రైతాంగ సమస్యలు, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, రైతుల హక్కుల పరిరక్షణ తదితర అంశాలపై మహాసభలో చర్చించారు. నవంబర్ 15 నుంచి నల్గొండలో 36వ ఆలిండియా కిసాన్ సభ జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నారు. 167 మందితో ఆలిండియా కిసాన్ కౌన్సిల్ ఎన్నుకోవడం జరిగింది.
అశోక్ ధావలే

భారతదేశ రైతు ఉద్యమాలలో మూడు దశాబ్దాలకు పైగా కీలక పాత్ర పోషిస్తున్న పోరాట యోధుడు అశోక్ ధావలే మరోసారి అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు.
1978లో ఎస్ఎఫ్ఐ (SFI) ద్వారా ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. మహారాష్ట్రకు చెందిన ఆయన ఎంబీబీఎస్ పట్టభద్రుడు. 1980 నుండి 1989 వరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శిగా, అఖిల భారత ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 1989 నుండి 1995 వరకు డీవైఎఫ్ఐ (DYFI) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు.
1993లో అఖిల భారత కిసాన్ సభలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2001 నుండి 2009 వరకు కిసాన్ సభ మహారాష్ట్ర రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 2017లో హర్యానాలో జరిగిన 34వ అఖిల భారత మహాసభలో మొదటిసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1998 నుండి సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2005 నుండి 2015 వరకు మహారాష్ట్ర రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన ఆయన, కన్నూర్‌లో జరిగిన 23వ పార్టీ కాంగ్రెస్‌లో పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎన్నికయ్యారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (AIDWA) ప్రధాన కార్యదర్శి మరియం ధావలే ఈయన సతీమణి.







కామెంట్‌లు (0)