నవతెలంగాణ - హైదరాబాద్ : తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ అభిషేక్ బెనర్జీ నివాసంపై దాడి జరిగినట్లు ఆయన ఆరోపించారు. కోల్‌కతాలోని కాళీఘాట్‌లో ఉన్న తన ఇంటి వద్ద శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. తన పుట్టినరోజు రోజునే హత్య చేసేందుకు ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. బీజేపీ మద్దతుదారులు ఇటుకలు, రాళ్లతో దాడి చేయగా పలువురు గాయపడ్డారని పేర్కొన్నారు.
తెల్లవారుజామున 2 గంటల సమయంలో తన ఇంటి బయట నినాదాలతో ఘర్షణ మొదలైందని అభిషేక్ తెలిపారు. దాడికి రెండు రోజుల ముందే తన నివాసం వద్ద రెక్కీ నిర్వహించారని, గత ఆరు నెలల్లో తనపై ఇది ఏడో హత్యాయత్నమని ఎక్స్ వేదికగా ఆరోపించారు. ఈ ఘటనలో తన సహచరులకు గాయాలయ్యాయని, పోలీసుల సమక్షంలోనే ఘర్షణ జరిగినా వారు జోక్యం చేసుకోలేదని విమర్శించారు. అయితే అభిషేక్ ఆరోపణలను బీజేపీ నేతలు ఖండించారు. ఈ ఘటనను డ్రామాగా అభివర్ణించారు. మరోవైపు, అభిషేక్ నివాసం వెలుపల తెల్లవారుజామున 2 నుంచి 3.30 గంటల






కామెంట్‌లు (0)