నవతెలంగాణ-హైదరాబాద్: ఈనెల(నవంబర్) 11న జమ్మూ కుల్గాంలోని మీర్ బజార్ సమీపంలో ఉన్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) పోస్టుపై ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆ తర్వాత ఉగ్రవాదులు అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. తాజాగా కుల్గాం ఉగ్రదాడికి భద్రతా బలగాలు ప్రతీకారం తీర్చుకున్నాయి. సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై దాడి ఘటనలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, లష్కరే తోయిబాకు చెందిన లతీఫ్ భట్ హతమయ్యాడు. కుల్గాం జిల్లాలోని లారూ ప్రాంతంలో భద్రతా దళాలు చేపట్టిన గాలింపు చర్యల సందర్భంగా ఈ ఎదురుకాల్పులు జరిగాయి. సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో లతీఫ్‌తో సహా ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.







కామెంట్‌లు (0)