Magazines

టైగర్‌ ష్రాఫ్‌పై హత్యాయత్నం.. ముగ్గురు షూటర్ల అరెస్ట్‌

19 అక్టోబర్, 2026

Tiger Shroff
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌పై హత్యాయత్నం కేసులో పోలీసులు ముగ్గురు షూటర్లను అరెస్ట్‌ చేశారు. రైలులో ప్రయాణిస్తుండగా రాజస్థాన్‌లోని కోట రైల్వే స్టేషన్‌లో వారిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ నిందితులకు గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ ముఠాతో సంబంధాలు ఉన్నట్లు సమాచారం. అరెస్టయిన వారిలో ఇద్దరు హర్యానాకు చెందినవారు కాగా, మరొకరు మహారాష్ట్ర వాసి. ఈ దాడికి సంబంధించి నిందితులు ముందుగానే పక్కా ప్రణాళిక రూపొందించుకున్నట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్