Magazines

సెనెగల్‌ తీరంలో పడవ బోల్తా.. 21 మంది మృతి

2 గంటల క్రితం

Boat capsizes off Senegal coast, 21 deada
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : పశ్చిమ ఆఫ్రికా దేశం సెనెగల్‌ తీరంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వలసదారులతో యూరప్‌కు వెళ్తున్న పడవ సముద్రంలో బోల్తాపడి మునిగిపోవడంతో కనీసం 21 మంది మృతి చెందారు. ఈ ఘటనను సెనెగల్‌ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదివారం ధ్రువీకరించింది. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు గాలింపు, సహాయక చర్యలు చేపట్టారు. శనివారం సాయంత్రం నాటికి ఒకరిని సురక్షితంగా రక్షించారు. పడవలో మొత్తం ఎంతమంది ఉన్నారనే దానిపై స్పష్టత లేకపోవడంతో గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మానవ అక్రమ రవాణా నెట్‌వర్క్‌లను అరికట్టేందుకు చర్యలు చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది. అక్రమ వలసల కోసం ప్రమాదకర సముద్ర ప్రయాణాలు చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఇటీవల జిబౌటి తీరంలో పడవ ప్రమాదంలో 109 మంది మృతి చెందిన ఘటన మరువకముందే సెనెగల్‌లో మరో విషాదం చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్