Magazines

శ్రీశైలంలో అదుపుతప్పిన ట్రావెల్స్‌ బస్సు.. ఐదు కార్లు ధ్వంసం

22 నిమిషాల క్రితం

Travel bus goes out of control in Srisailam, five cars destroyed

Travel bus goes out of control in Srisailam, five cars destroyed

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – హైదరాబాద్‌: శ్రీశైలంలో సోమవారం ట్రావెల్స్‌ బస్సు బ్రేకులు ఫెయిల్‌ కావడంతో ప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన భక్తులతో వెళ్తున్న టూరిస్ట్‌ బస్సు అదుపుతప్పి అలంకేశ్వరస్వామి ఆలయం క్లోజింగ్‌ గేట్‌ సమీపంలో పార్క్‌ చేసిన ఐదు కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదు కార్లు ధ్వంసం కాగా, ఓ కారులో ఉన్న బాలికకు స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం బస్సు పక్కనే ఉన్న గేట్‌ను ఢీకొని ఆగిపోయింది. ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, దేవస్థానం భద్రతా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. బస్సు బ్రేకులు ఫెయిల్‌ కావడమే ప్రమాదానికి కారణమా, డ్రైవర్‌ నిర్లక్ష్యమా అన్నది తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్