నవతెలంగాణ - హైదరాబాద్ : ఈజిప్టులోని గిజా ప్రావిన్స్ అల్-అయ్యత్ జిల్లాలో రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. స్థానిక మీడియా 120 మంది గాయపడినట్లు వెల్లడించగా, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మాత్రం 64 మంది గాయపడినట్లు ప్రకటించింది. గిజా నుంచి ఫయ్యూమ్‌కు వెళ్తున్న రైలు.. కైరో–అస్వాన్ మార్గంలో ప్రయాణిస్తున్న మరో రైలును వెనుక నుంచి ఢీకొట్టడంతో కొన్ని బోగీలు పట్టాలు తప్పాయి. సహాయక బృందాలు క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నాయి.
ఈజిప్టులో రెండు రైళ్లు ఢీ.. నలుగురు మృతి
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 09, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)