Magazines

దీపావళి తర్వాత ఢిల్లీలో పెరిగిన కాలుష్యం..

1 గంట క్రితం

Pollution in Delhi increased after Diwali.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : దీపావళి పండుగ తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. సోమవారం (నవంబర్‌ 9) ఉదయం 6 గంటలకు నగర సగటు ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (ఏక్యూఐ) 366గా నమోదైంది. దీంతో గాలి నాణ్యత ‘వెరీ పూర్‌’ స్థాయికి పడిపోయింది. నగరంలోని 15 మానిటరింగ్‌ కేంద్రాల్లో ఏక్యూఐ 400 దాటింది. అర్ధరాత్రి నుంచే నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్ముకుంది. పలు ప్రాంతాల్లో దృశ్యమానత తగ్గడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సోనియా విహార్‌లో అత్యధికంగా 449, బురారీ క్రాసింగ్‌లో 445, వివేక్‌ విహార్‌లో 441, జహంగీర్‌పురిలో 439 ఏక్యూఐ నమోదైంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఇప్పటికే గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌ (గ్రాప్‌) స్టేజ్‌-3 అమల్లో ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్