నవతెలంగాణ-హైదరాబాద్ : పాకిస్థాన్‌లోని మక్రాన్ కోస్టల్ హైవేపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఎల్‌పీజీ గ్యాస్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాల్లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 27 మంది గాయపడ్డారు. క్షణాల్లోనే రెండు వాహనాలు మంటల్లో చిక్కుకోవడంతో ఘోర విషాదం నెలకొంది.






కామెంట్‌లు (0)