నవతెలంగాణ-హైదరాబాద్ : న్యూజిలాండ్-భారత్ మధ్య తొలి టెస్టు రెండో రోజు ఆట కొనసాగుతోంది. 243/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో బ్యాటింగ్ ఆరంభించిన కివీస్ జట్టు 7 వికెట్లు కోల్పోయింది. హెన్రీ నికోల్స్(155) క్రీజులో పాతుకుపోయి జట్టు స్కోర్‌ను పరుగులు పెట్టిస్తున్నాడు. అతడికి జోడీగా నిలిచి గ్లెన్ ఫిలిప్స్(118) కూడా శతకం సాధించాడు. అయితే, 94వ ఓవర్లో 286 పరుగుల వద్ద ఆకాశ్‌దీప్ బౌలింగ్‌లో ఫిలిప్స్ బౌల్డయ్యాడు. ఆరో వికెట్‌కి వీరిద్దరూ కలిసి 216 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం నాథన్ స్మిత్ (14) ప్రసిద్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. భారత బౌలర్లు బుమ్రా 3, ఆకాశ్‌దీప్ 2, అన్షుల్, ప్రసిద్ది క్రిష్ణ చెరో వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం జట్టు స్కోరు 343/7 గా ఉంది.






కామెంట్‌లు (0)