Magazines

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా..

18 నిమిషాల క్రితం

mro
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026 | 1 నిమిషాల చదవడం

- ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం
అర్హులైన కుటుంబాలు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి – తహసీల్దార్ కిరణ్
నవ తెలంగాణ- చిన్నగూడూరు : రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించింది. బుధవారం నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో అర్హులైన కుటుంబాలు బీమా నమోదు చేసుకోవాలని చిన్నగూడూరు తహసీల్దార్ కిరణ్ కుమార్ సూచించారు.ఈ పథకం కింద ప్రతి కుటుంబంలో సంపాదించే వ్యక్తుల్లో ఒకరిని ఎంపిక చేసుకుని వారి పేరుపై జీవిత బీమా నమోదు చేసుకోవాలి. వారు అన్నారు.18నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన వారికి ఈ పథకం వర్తిస్తుంది. బీమా పొందిన వ్యక్తికి ప్రమాదవశాత్తు మరణం సంభవించినా, అర్హత నిబంధనల ప్రకారం బాధిత కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారం అందుతుంది అని తెలిపారు .అర్హత కలిగిన ప్రతి కుటుంబం సులభంగా ఈ పథకంలో చేరేందుకు మండలంలో ని అన్ని గ్రామాలలో సహాయక శిబిరాలను ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్