నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసం వద్ద కలకలం రేగింది. ఖమ్మంకు చెందిన సుచిత్ అనే అభిమాని పవన్‌ను కలవాలంటూ హంగామా సృష్టించాడు. అప్పులు తీర్చేందుకు ఆర్థిక సాయం చేయాలని కోరుతూ ఇంటి ఎదుట ప్లెక్సీ ప్రదర్శించాడు. ఈ క్రమంలో బాడీగార్డ్‌పై దాడికి యత్నించడంతో పాటు, తన ఛాతీ, చేతులపై కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్పందించిన పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పవన్ కళ్యాణ్ ఇంటి ముందు అభిమాని ఆత్మహత్యాయత్నం!
43 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 20, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)