నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 14.7 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదైనట్లు తెలిపింది.
ఆదిలాబాద్ జిల్లాలోని నేరేడుగొండలో అత్యల్పంగా 14.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాత్రి ఉష్ణోగ్రతలు 17 నుంచి 19 డిగ్రీల మధ్య ఉంటున్నాయి. చలి తీవ్రత దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.







కామెంట్‌లు (0)