Magazines

అమర్‌కంటక్ ఆలయంలో విగ్రహం కింద చిక్కుకున్న భక్తుడు

33 నిమిషాల క్రితం

Devotee trapped under idol in Amarkantak temple
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : మధ్యప్రదేశ్‌లోని అమర్‌కంటక్ నర్మదా ఆలయంలో ఏనుగు విగ్రహం కింద నుంచి వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ భక్తుడు మధ్యలో చిక్కుకుపోయాడు. తోటి భక్తులు శ్రమించి అతడిని బయటకు తీశారు. ఏనుగు, గుర్రం విగ్రహాల కాళ్ల మధ్య నుంచి వెళ్లితే కోరికలు నెరవేరుతాయని కొందరు భక్తులు నమ్ముతుండటంతో అతడు ఈ ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన వీడియో నవంబర్‌లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలాంటి ఆచారాల పేరుతో ప్రమాదకరమైన ఇరుకైన మార్గాల్లోకి వెళ్లడం ప్రాణాపాయానికి దారితీస్తుందని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.


ఇటీవల తమిళనాడులోని అరుణాచలం గిరిప్రదక్షిణ మార్గంలో ఉన్న ఇడుక్కు పిల్లయ్యార్ ఆలయంలో ఇరుకైన మార్గంలో చిక్కుకుని రాజమండ్రికి చెందిన మణికుమార్ (36) మృతి చెందిన ఘటన కూడా ఆందోళన కలిగించింది. ఇలాంటి ప్రమాదకర ఆచారాల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.



సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్