నవతెలంగాణ - హైదరాబాద్ : కుటుంబ తగాదా నేపథ్యంలో కౌన్సెలింగ్ కోసం పోలీస్ స్టేషన్‌కు పిలిచిన నబీల్ అనే వ్యక్తి పోలీసులపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఢిల్లీలోని జామా మసీద్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం జరిగిన ఈ ఘటనలో ఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లతో సహా మొత్తం 9 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. దాడి అనంతరం పరారైన నిందితుడిని మధ్యాహ్నం ఛిట్లీ కబల్ ప్రాంతంలో పోలీసులు చుట్టుముట్టారు. ఈ సమయంలో నిందితుడు మళ్లీ దాడికి యత్నించడంతో ఆత్మరక్షణలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నబీల్ కాళ్లకు ఆరు బుల్లెట్లు తగిలినట్లు సమాచారం. గాయపడిన నిందితుడితో పాటు పోలీసులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పోలీస్ స్టేషన్‌లో వ్యక్తి వీరంగం.. 9 మంది పోలీసులకు గాయాలు
50 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)