Magazines

టోల్‌ప్లాజాల వద్దే ఇన్సూరెన్స్‌ లేని వాహనాలకు SMS అలర్ట్‌లు

46 నిమిషాల క్రితం

NHAI to pilot SMS alerts at toll plazas for motorists without third-party insurance
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ లేని వాహనదారులకు ఇకపై టోల్‌ప్లాజాల వద్దే SMS అలర్ట్‌లు పంపించే విధానాన్ని NHAI ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలోని ముండ్కా టోల్‌ప్లాజా వద్ద ఈ పైలట్‌ ప్రాజెక్టును పరీక్షిస్తోంది. ఈ విధానంలో టోల్‌ దాటిన వాహన వివరాలను వాహన్‌ డేటాబేస్‌ ద్వారా తనిఖీ చేస్తారు. బీమా గడువు ముగిసినట్లయితే వాహనం రిజిస్ట్రేషన్‌ నంబర్‌, బీమా గడువు తేదీ వివరాలతో రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు SMS పంపిస్తారు. ఈ ప్రయోగం విజయవంతమైతే దేశవ్యాప్తంగా అమలు చేయాలని NHAI యోచిస్తోంది. ఇక బీమా లేకుండా వాహనం నడిపితే మొదటిసారి రూ.5 వేల జరిమానా, మరోసారి నిబంధన ఉల్లంఘిస్తే రూ.10 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్