నవతెలంగాణ - హైదరాబాద్ : హరియాణాలోని సోనీపత్‌లో కట్నంగా కోరిన రూ.13 లక్షల మారుతీ బ్రెజ్జా కారు ఇవ్వలేదని పెళ్లిని రద్దు చేసుకున్న ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్‌పై శాఖాపరమైన చర్యలు చేపట్టారు. నవంబరు 20న జరగాల్సిన వివాహానికి వరుడు కుల్దీప్ తన తల్లితో కలిసి వచ్చి, కోరిన కారు ఇవ్వలేదంటూ వధువు కుటుంబాన్ని దూషించి పెళ్లి మండపం నుంచి వెళ్లిపోయాడు. వధువు కుటుంబం ఇప్పటికే రూ.9.5 లక్షల హ్యుందాయ్ ఆరా కారును బుక్ చేసినప్పటికీ వరుడు అంగీకరించలేదు. ఈ ఘటనపై వధువు తండ్రి ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ పోలీస్ శాఖ కుల్దీప్‌ను సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణ ప్రారంభించింది.
కారు కోసం పెళ్లి రద్దు.. పోలీస్ కానిస్టేబుల్ సస్పెండ్
39 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)