Magazines

అడవిలో తలలేని మహిళ మృతదేహం కలకలం

1 రోజు క్రితం

murder
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో అడవిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం తల లేకుండా పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలు ఎవరు? ఆమెను హత్య చేశారా లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణాల్లో విచారణ చేపట్టారు. సాక్ష్యాలను సేకరించేందుకు ఫోరెన్సిక్ బృందం కూడా క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహించింది. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్