Magazines

‘వీటో’ అంటూ డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులు

4 గంటల క్రితం

Team India secures a resounding victory in the first ODI
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్‌లు ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే.తాజా లెక్కల ప్రకారం సెనేట్‌లో 100 స్థానాలకు గాను 53 స్థానాలను గెలుచుకున్నారు. ప్రతినిధుల సభలోనూ మెజారిటీకి అవసరమైన 218 స్థానాల మార్కును దాటి 220 స్థానాలను కైవసం చేసుకున్నారు. దీంతో రెండు సభల్లోనూ డెమోక్రాట్‌లకు ఆధిపత్యం లభించింది. దీంతో ప్రతిపక్ష‍ం విజయాన్ని జీర్ణించుకోలేని అధ్యక్ష‍ుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ ద్వారా వీటో అంటూ ఎరుపు రంగు రిపబ్లికన్ టోపీ ఫొటోను పోస్టు చేశారు.


ఆ దేశ చట్టసభలు సెనెట్, కాంగ్రెస్ ల్లో డెమోక్రాట్‌లు నిర్ణయాలను తాను వీటో ద్వారా అడ్డుకుంటామని అత్యున్నత స్థాయి పదవీలో ఉండి ట్రంప్ బెదిరింపులకు దిగజారారు.డెమోక్రాట్‌లు తీసుకొచ్చే ప్రతిపాదనల్లో తనకు ఆమోదయోగ్యం కాని వాటిని అడ్డుకునేందుకు అధ్యక్షుడిగా తనకున్న వీటో అధికారాన్ని ఉపయోగిస్తాననే సంకేతాన్ని ఈ పోస్ట్ ద్వారా ఇచ్చారు. కాంగ్రెస్‌లో డెమోక్రాట్‌లకు మెజారిటీ రావడంతో ట్రంప్ ప్రభుత్వానికి పలు అంశాల్లో ఇబ్బందులు ఎదురుకావచ్చు. ప్రభుత్వ నిర్ణయాలపై విచారణలు చేపట్టడం, పరిపాలనా వ్యవహారాలపై ప్రశ్నలు లేవనెత్తడం, కొత్త చట్టాల ఆమోదాన్ని అడ్డుకోవడం వంటి అధికారాలు వారికి ఉంటాయి.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్