నవతెలంగాణ - హైదరాబాద్ : సీఎంఆర్‌ఎల్–ఎక్సాలాజిక్ లావాదేవీల కేసులో కేరళ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం పినరయి విజయన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఆయన ఇంటికి వెళ్లిన అధికారులు నోటీసును స్వీకరించేందుకు సిబ్బంది నిరాకరించడంతో గోడకు అతికించారు. నోటీసుకు సాక్షిగా సంతకం చేయాలని ఇంటి సిబ్బందిని, సమీపంలోని దుకాణదారుడిని కోరగా వారు నిరాకరించారు. దీంతో ఇద్దరు పోలీసు అధికారులు సాక్షులుగా సంతకాలు చేశారు. ఈ నెల 23న కొచ్చిలోని ఈడీ కార్యాలయంలో హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. ఆ సమయంలో పినరయి విజయన్ కన్నూరులో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈడీ, పోలీసుల చర్యలు ఉద్దేశపూర్వకంగా అవమానించేందుకేనని సీపీఐ(ఎం) నేతలు విమర్శించారు.
మాజీ సీఎం పినరయి విజయన్‌కు ఈడీ నోటీసులు
17 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 17, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)