నవతెలంగాణ-సూర్యాపేట: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. పట్టణంలోని ముదిరాజ్ బజార్‌లో మామిడి రాములమ్మ (65)ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి, ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను అపహరించారు. సుమారు నాలుగు తులాల బంగారం చోరీకి గురైనట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఎస్‌ఐ నరేశ్ తెలిపారు. రద్దీ ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వృద్ధురాలిని హత్య చేసి ఒంటిపై బంగారం చోరీ
21 అక్టోబర్, 2026

Elderly woman murdered and gold stolen on the spot
వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 21, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)