Magazines

కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌ లో అగ్నిప్రమాదం..నాలుగు బోగిల్లో చేలరేగిన మంటలు

2 గంటల క్రితం

Fire breaks out on Karmabhumi Express; flames erupt in four coaches.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌: అమృత్‌సర్-న్యూ జల్పైగురి మధ్య నడిచే 12508 నంబర్ గల కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌ అగ్నిప్రమాదానికి గురైంది. శుక్రవారం పంజాబ్‌లోని సరాయ్ బంజారా రైల్వే స్టేషన్ సమీపంలో నాలుగు బోగిల్లో అగ్నిప్రమాదం సంభవించింది. దట్టమైన పొగలు పరిసర ప్రాంతాలను కమ్మెశాయి. దీంతో భయాందోళనలతో ప్రయాణికులు పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు..సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


సమాచారం ప్రకారం, షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే, దీనికి గల కచ్చితమైన కారణాన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్