చేపల మార్కెట్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక దాడులు

2 గంటల క్రితం

Food safety officials conduct surprise raids on fish market
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని రామ్‌నగర్ చేపల మార్కెట్‌పై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ (TG SAFE) అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వినియోగానికి పనికిరాని, కుళ్లిపోయిన సుమారు 40 కిలోల చేపలను అధికారులు గుర్తించి అక్కడికక్కడే ధ్వంసం చేశారు. మార్కెట్‌లోని పలు దుకాణాల్లో కనీస పరిశుభ్రత పాటించకుండా, అపరిశుభ్ర వాతావరణంలో చేపలను నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన రెండు దుకాణాలకు నోటీసులు జారీ చేసి, వాటిని తక్షణమే మూసివేయాలని ఆదేశించారు. అలాగే, ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్న మరికొందరు వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్