నవతెలంగాణ - హైదరాబాద్ : మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రవేట్ హోటల్‌లో భూగర్భ ఆహార వ్యర్థాల గదిని శుభ్రం చేస్తుండగా విషవాయువు పీల్చి నలుగురు కార్మికులు మృతిచెందారు. శనివారం అర్ధరాత్రి శ్రీ గంగా హోటల్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఓ కార్మికుడు లోపల పడిపోవడంతో అతడిని కాపాడేందుకు వెళ్లిన మరో ముగ్గురు కూడా అస్వస్థతకు గురయ్యారు. సహాయక చర్యల్లో పాల్గొన్న మరో ఇద్దరు సైతం వాయువు ప్రభావానికి గురయ్యారు. పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని కార్మికులను బయటకు తీసి దర్యాప్తు చేపట్టారు.
హోటల్‌లో విషవాయువు పీల్చి.. నలుగురు కార్మికులు మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 02, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)