నవతెలంగాణ - హైదరాబాద్: ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఓ యువకుడు మాదాపూర్ దుర్గం చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కోనసీమకు చెందిన ఆయన నల్లగండ్లలో నివాసముంటూ వ్యాపారం చేస్తున్నారు. కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. శనివారం దుర్గం చెరువు వద్దకు వచ్చిన ఆయన కనిపించకపోవడంతో స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు గాలింపు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. ఘటనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దుర్గం చెరువులో యువ వ్యాపారి మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 02, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)