Magazines

ఉత్తరాఖండ్‌లో కూలిన హెలికాప్టర్‌ .. ఆరుగురు మృతి

49 నిమిషాల క్రితం

Helicopter crashes
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తరాఖండ్‌లో ప్రైవేట్‌ కంపెనీకి చెందిన హెలికాప్టర్‌ ఒకటి కుప్పకూలింది. ఈ ఘటనలో ‘ట్రాన్స్‌ భారత్‌’ ఏవియేషన్‌ సంస్థకు చెందిన చాపర్‌లో పైలట్‌ సహా ఆరుగురు వ్యక్తులు ఉండగా.. అందరూ మృతి చెందినట్లు చమోలీ ఎస్పీ సూర్జిత్‌ సింగ్‌ పన్వాడ్‌ ప్రకటించారు. బద్రీనాథ్‌ నుండి డెహ్రాడూన్‌ వెళ్తున్న హెలికాఫ్టర్‌ జోషిమఠ్‌ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం కూలిపోయినట్లు తెలిపారు. హెలికాప్టర్‌ కుప్పకూలిన ఘటనలో మృతిచెందిన వారిలో బెంగళూరుకు చెందిన సీసీబీ ఇన్‌స్పెక్టర్‌ అరుణ్‌ శాలంకి, న్యాయవాదులు ప్రతాప్, శంకరగౌడ, సుధీర్, నటరాజ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బద్రీనాథ్‌ను సందర్శించి దేహ్రాదూన్‌కు వెళ్తుండగా ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ కుప్పకూలి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్