Magazines

రష్యాలో హైదరాబాద్ వ్యాపారవేత్త అరెస్ట్‌.. విడిపించాలని కుటుంబం విజ్ఞప్తి

35 నిమిషాల క్రితం

Hyderabad businessman arrested in Russia, family appeals for his release
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : వ్యాపార నిమిత్తం రష్యాకు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త మహమ్మద్ ఆదిల్ మొహియుద్దీన్ (36) అక్కడి పోలీసులు అరెస్టు చేయడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. నవంబర్‌ 2 నుంచి జైలులో ఉన్న ఆయనను సురక్షితంగా భారత్‌కు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

పాత మౌలాలీకి చెందిన ఆదిల్‌ కుషాయిగూడలో మెడికల్‌ స్టోర్‌ నిర్వహిస్తున్నారు. వైద్య పరికరాల కొనుగోలు, వ్యాపార విస్తరణ కోసం అక్టోబర్‌ 26న సందర్శక వీసాపై రష్యాకు వెళ్లారు. ఉల్యానోవ్స్క్ ప్రాంతంలోని హోటల్‌లో ఉంటున్న ఆయనను నవంబర్‌ 2న పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రీ-ట్రయల్‌ డిటెన్షన్‌ సెంటర్‌కు తరలించినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.

అరెస్టుకు గల కారణాలు, అభియోగాలపై స్పష్టత లేకపోవడంతో ఆదిల్‌ కుటుంబ సభ్యులు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌కు లేఖ రాశారు. మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ద్వారా రష్యా అధికారులతో సంప్రదింపులు జరిపి, న్యాయ సహాయం అందించడంతో పాటు ఆయనను సురక్షితంగా భారత్‌కు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్