Magazines

ఈ మూడేళ్లలో మహిళా సంఘాలకు రూ.75 వేల కోట్లు రుణాలు ఇచ్చాం

3 గంటల క్రితం

Minister Seethakka
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026 | 1 నిమిషాల చదవడం

- పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క

నవతెలంగాణ-హైదరాబాద్: కేవలం ఈ మూడేళ్లలో మహిళా సంఘాలకు రూ.75 వేల కోట్లు రుణాలు ఇచ్చామని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క గుర్తు చేశారు. మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా పెట్రోల్ బంక్, సోలార్ పవర్ ప్లాంట్స్‌తోపాటు 300 ప్రాంతాల్లో ఇందిర మహిళా శక్తి క్యాంటీన్లు ఇచ్చామని అన్నారు.బుధవారం వరంగల్ జిల్లా సంగెం మండలం స్టేషన్ చింతలపల్లి టెక్స్‌టైల్ పార్క్ పైలాన్ వద్ద రూ. 45 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు చేయూత పెన్షన్ పత్రాలను ఆమె పంపిణీ చేశారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఇంట్లో ఆడ కూతురు సంతోషంగా ఉండాలనేది సీఎం రేవంత్ రెడ్డి ఆరాటమని చెప్పారు. మహిళా సంఘాలకు మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్ ఇస్తామని తెలిపారు.ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులతోపాటు పథకాలన్నీ మహిళల పేరు మీదే ఇస్తున్నామని మంత్రి సీతక్క వివరించారు.





ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్