Magazines

బంగ్లాదేశ్‌ కు అవామీ లీగ్‌ అధినేత్రి షేక్‌ హసీనా.. భారత్‌ రెండు కీలక షరతులు

2 గంటల క్రితం

India sets two key conditions regarding Awami League leader Sheikh Hasina and Bangladesh.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్:

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని, అవామీ లీగ్‌ అధినేత్రి షేక్‌ హసీనా స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు భారత్‌ రెండు కీలక షరతులు విధించినట్లు బీబీసీ బంగ్లా కథనం వెల్లడించింది. ఆమె భద్రతకు హామీ ఇవ్వడంతోపాటు, న్యాయమైన విచారణకు అవకాశం కల్పించాలని భారత్‌ కోరుతున్నట్లు పేర్కొంది.2024 ఆగస్టులో ప్రజా ఆందోళనల నేపథ్యంలో ... ప్రధాని పదవికి రాజీనామా చేసిన హసీనా, బంగ్లాదేశ్‌ సైనిక విమానంలో భారత్‌కు చేరుకున్నారు. ప్రస్తుతం భారత్‌లోనే ఉంటున్న ఆమె డిసెంబర్‌లో స్వదేశానికి తిరిగి వెళ్లాలని భావిస్తున్నట్లు ప్రకటించారు.


హసీనాను తిరిగి తీసుకెళ్లే బాధ్యతను బంగ్లాదేశ్‌ సైన్యమే చేపట్టాలని భారత్‌ కోరుతున్నట్లు సమాచారం. ఇందుకోసం సైనిక విమానాన్ని ఢిల్లీకి పంపడం లేదా నిర్ణీత సరిహద్దు ప్రాంతంలో ఆమెను స్వీకరించే ఏర్పాట్లు చేయవచ్చని కథనం పేర్కొంది.


మరోవైపు, 2024 నాటి అణచివేతకు సంబంధించిన కేసులో హసీనాకు న్యాయమైన విచారణతోపాటు, మరణశిక్ష పై అప్పీల్‌ చేసుకునే అవకాశం కల్పించాలని భారత్‌ కోరుతున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ సమాజం, ప్రపంచ మీడియా పర్యవేక్షణలో విచారణ జరగాలని కూడా అభిప్రాయపడుతున్నట్లు బీబీసీ వెల్లడించింది. ఈ అంశంపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ స్పందించేందుకు నిరాకరించారు.


కాగా, బంగ్లాదేశ్‌ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్‌ 2025 నవంబర్‌లో హసీనాకు గైర్హాజరీలో మరణశిక్ష విధించింది. ఈ నేపథ్యంలో ఆమెకు ఆశ్రయం కల్పించేందుకు ఇతర దేశాలు ముందుకు రావడం లేదని బంగ్లాదేశ్‌ ప్రధాని సహాయ ప్రెస్‌ సెక్రటరీ కేఎం నజ్ముల్‌ హక్‌ పేర్కొన్నారు. హసీనా స్వదేశానికి తిరిగి రావాలనుకోవడం రాజకీయంగా చివరి ప్రయత్నమని ఆయన విమర్శించారు.


ఇదిలా ఉండగా ... నవంబర్‌ 9 న హసీనా కొత్త పాస్‌పోర్టు, ప్రయాణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఆమెను భారత్‌ అప్పగించాలని బంగ్లాదేశ్‌లోని కొందరు నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. పాస్‌పోర్టు అభ్యర్థన విషయంలో బంగ్లాదేశ్‌ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని భారత మాజీ దౌత్యవేత్త వీణా సిక్రీ వ్యాఖ్యానించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్