Magazines

ఆరంభంలోనే భారత్‌కు షాక్‌.. ముగ్గురు కీలక బ్యాటర్లు డకౌట్‌!

19 నిమిషాల క్రితం

India suffers a shock at the start.. Three key batters get out for a duck!

India suffers a shock at the start.. Three key batters get out for a duck!

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : న్యూజిలాండ్‌ స్పీడ్‌ బౌలర్‌ మ్యాట్‌ హెన్రీ భారత జట్టుకు తొలి ఓవర్‌లోనే భారీ షాక్‌ ఇచ్చాడు. 334 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. హెన్రీ వేసిన తొలి ఓవర్‌లో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, శ్రేయాస్‌ అయ్యర్‌ పెవిలియన్‌ చేరారు. రోహిత్‌ క్యాచ్‌ ఇచ్చి ఔట్‌ కాగా, కోహ్లీ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఆరో బంతికి శ్రేయాస్‌ అయ్యర్‌ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఈ ముగ్గురూ డకౌట్‌ కావడంతో భారత్‌ కష్టాల్లో పడింది. హెన్రీ తొలి ఓవర్‌లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు పడగొట్టాడు.


క్రికెట్‌ చరిత్రలో తొలి ఓవర్‌లోనే ముగ్గురు బ్యాటర్లు డకౌట్‌ కావడం ఇది రెండోసారి. గతంలో 2003 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక బౌలర్‌ చామిండ వాస్‌ తొలి ఓవర్‌లోనే నాలుగు వికెట్లు తీశాడు. తొలి మూడు బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టి హ్యాట్రిక్‌ సాధించిన వాస్‌, ఆ ఓవర్‌ చివరి బంతికి మరో వికెట్‌ తీసుకున్నాడు. ఇప్పటివరకు తొలి ఓవర్‌లో మూడు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లుగా వాస్‌, మ్యాట్‌ హెన్రీ చరిత్రలో నిలిచారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్